AP News:ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-02 08:22:39.0  )
AP News:ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ ఐటీ, ఆర్టీజీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేడు(మంగళవారం) అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేష్ గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ హయాంలో టీచర్ల బదిలీలల్లో ఎలాంటి అవినీతి జరగదని తేల్చి చెప్పారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని , ఈ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయుకులతో అన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌ను ఉపాధ్యాయ సంఘాలు కలిశాయి. ఎన్నికల కోడ్‌తో నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.

Advertisement

Next Story

Most Viewed