- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh:‘మీకు మనసెలా వచ్చింది’..జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శలు
దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగుళూరు ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతూ 74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న సీఎం చంద్రబాబు గారి పై విమర్శలు చేయడానికి మనస్సు ఎలా వచ్చింది. విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు..పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే!
నాడు చంద్రబాబు గారు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేశారు. సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా చేశారు. 2022 లోనే గండి పడిన పట్టించుకోలేదు. 5 ఏళ్లలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు. అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరికి వరద బాధితులకు సాయం అందించే వరకు విశ్రమించమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.