- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విదేశాల్లో చావే దిక్కంటూ కార్మికుడు కన్నీరు..స్పందించిన మంత్రి నారా లోకేష్
దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలామంది యువత ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారు కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను, పిల్లలను, పుట్టిన ఊరును, చివరకు దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. అక్కడ వారు పడే కష్టాలు ఎవరికీ చెప్పుకునే వీలుండదు. ఈక్రమంలో వారు ఎంతో మానసిక ఒత్తిడి లోనవుతారు. అయితే చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడి యజమానుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్న వారిపై జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఘటనే కువైట్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..విదేశాల్లో వేధింపులకు గురైన ఓ కార్మికుడు తన ఆవేదనను ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. కువైట్‌లో దారుణమైన జీవితం గడుపుతున్నామని ఓ తెలుగు కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సహాయం చేయకపోతే చావే దిక్కని వీడియోలో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ వీడియో పై తాజాగా స్పందించిన మంత్రి లోకేష్ అతడిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.