- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ప్రభుత్వం మనసున్న మంచి ప్రభుత్వం : మంత్రి నారా లోకేష్
దిశ, వెబ్ డెస్క్: యువగళం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరొక హామీని నెరవేర్చామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో.. ఎలాంటి ఆదాయం లేని ఆలయాలలో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని పాదయాత్ర సమయంలో.. బ్రాహ్మణులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఆనాడు వారికి నైవేద్య సహాయం పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చామని పేర్కొన్నారు.
నాడు ఇచ్చిన మాటప్రకారం.. నేడు ధూప, దీప, నైవేద్య సహాయం రూ.10 వేలకు పెంచామని.. ఫలితంగా రాష్ట్రంలోని 5400 చిన్న ఆలయాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడి సేవకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. తమ ప్రభుత్వం అందరి క్షేమాన్ని కోరే మంచి మనసున్న ప్రభుత్వమని పోస్ట్ లో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచడంతో.. పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది.