AP News:‘తల్లికి వందనం’ పథకం పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన..!

by Jakkula Mamatha |   ( Updated:2024-07-24 15:52:05.0  )
AP News:‘తల్లికి వందనం’ పథకం పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మార్పు చేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో తల్లికి వందనం పథకం పై పలు సందేహాలు ప్రజలలో ఉన్నాయి. అయితే మంత్రి నారా లోకేష్ ఈ పథకం పై తాజాగా కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ పథకం పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.

Read More..

AP News:విశాఖకు రైల్వే జోన్..కేంద్రం కీలక ప్రకటన

Advertisement

Next Story

Most Viewed