- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Nara Lokesh:బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం
దిశ,వెబ్‌డెస్క్:యువ క్రీడాకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ మరోసారి రుజువు చేశారు. తాజాగా మంగళగిరి నియోకవర్గానికి చెందిన యువ బ్యాడ్మింటన్(Youth Badminton) క్రీడాకారుడు(sportsman) కె.చరణ్ నాయక్‌కు ఆర్థిక చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. చరణ్ నాయక్ అంతర్జాతీయ స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్(Shuttle badminton) క్రీడలో సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 20 వరకు, న్యూజిలాండ్‌లో(New Zealand) 23వ తేదీ నుంచి 26 వరకు జరగనున్న అంతర్జాతీయ ర్యాంకింగ్(International ranking) పోటీల్లో చరణ్ పాల్గొంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఆ యువ క్రీడాకారుడికి(sportsman) రెండు విదేశీ పర్యటనలు(Foreign trips) చేయాల్సి రావడంతో ఆర్థిక సహాయం కోరుతున్నాడు. నిన్న(శనివారం) మంత్రి నారా లోకేష్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. చరణ్ నాయక్ గురించి తెలుసుకున్న నారా లోకేష్ అతని విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. 'ప్రైడ్ ఆఫ్ మంగళగిరి' పేరిట అతనికి ఆర్థిక సాయం చేశారు. స్థానిక టీడీపీ నేతల ద్వారా రూ.3 లక్షలు చరణ్ నాయక్‌కు అందించారు. లోకేష్ తనకు ఆర్థిక సాయం చేయడం పట్ల ఆ యువ క్రీడాకారుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మంత్రి లోకేష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు.