- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం..మంత్రి లోకేష్ ఆగ్రహం
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న గంజాయి కేసులపై ప్రభుత్వాలు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయిన కూడా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా సాగుతున్నట్టు సమాచారం. గంజాయి బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. దీంతో క్యాంపస్‌లో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి లోకేష్‌ను కలిశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని క్యాంపస్‌లో చేర్పిస్తే గంజాయి బారిన పడుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని అన్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడతానని భరోసా ఇచ్చారు. గంజాయి కలకలం పై తక్షణమే విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.