- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న భువనేశ్వరి..మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కుప్పం నుంచి తాను పోటీ చేస్తానని.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు ఓటమిని భువనేశ్వరి ముందుగానే పనిగట్టారంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును గెలిపి కుప్పం ప్రజలు విసిగిపోయారని తెలిసే ఆమె పోటీ చేస్తానని అంటున్నారని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని.. ప్రజల ఆకాంక్షను ఆమె తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి సరదాగా చెప్పలేదని.. ఆమె మనసులో ఉన్న మాటని జోగి రమేశ్ చెప్పారు. 35 ఏళ్లు చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదని సొంత భార్య భువనేశ్వరినే చెప్పారని ఆయన సెటైర్లు వేశారు. 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీని ఓ ప్రాంతానికి పరిమితం చేశారని.. అందుకే జనసేన, బీజేపీకి సీట్లు పంచే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీకి దిక్కులేని పరిస్థితులు వచ్చాయని.. అందుకనే చంద్రబాబును పక్కకు తోసేయాలనేదే భువనేశ్వరి ఆలోచన అని మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.