Chandra babu Naidu, Pawan Kalyanకు మంత్రి జోగి రమేశ్ సవాల్

by srinivas |   ( Updated:2022-11-09 13:47:07.0  )
Chandra babu Naidu, Pawan Kalyanకు మంత్రి జోగి రమేశ్ సవాల్
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు. జగనన్న కాలనీల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదన్న ఆయన దమ్ముంటే నిరూపించాలన్నారు. అంతేకాదు చర్చించేందుకు టైమ్ చెప్పాలని తాను వస్తానని సవాల్ విసిరారు. ఏ జగనన్న కాలనీకి రమ్మంటే అక్కడి వస్తానన్నారు. ఇప్పటం ఇళ్ల కూల్చివేతలపై చేస్తున్న విమర్శలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇంటిని కూల్చలేదన్నారు. రోడ్డు విస్తరణకు అడ్డొచ్చిన ప్రహరీ గోడలనే మాత్రమే అధికారులు తొలగించారని చెప్పారు. పవన్ విలనిజం, హీరోయిజం ప్రజాస్వామ్యంలో పనికిరాదని మంత్రి జోగి రమేశ్ హెచ్చరించారు.

Advertisement

Next Story