- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వంగవీటి రంగాను హత్య చేసింది అప్పటి TDP నాయకత్వమే: మంత్రి గుడివాడ అమర్నాథ్
దిశ, వెబ్‌డెస్క్: కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి, కీలక కాపు నేత చేగొండి హరిరామజోగయ్య, మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయవద్దని జోగయ్య.. టీడీపీతో జనసేన పొత్తు వ్యవహారం ఏంటని అమర్నాథ్.. ఇలా ఇద్దరు కాపు నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కాగా, ఇప్పటికే హరిరామజోగయ్యకు 2 లేఖలు రాసిన మంత్రి గుడివాడ తాజాగా మూడవ లేఖ రాశారు. కాపు నేత వంగవీటి రంగాను చంపించింది నాటి టీడీపీ నాయకత్వమే అని.. కాపు డీఎన్ఏ ఉన్న ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారని లేఖలో పేర్కొన్నారు. దీనికి కాపులైన మీరు, పవన్ మినహాయింపు అయితే మీ ఇష్టమని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు నాయుడే అని మీ పుస్తకంలో మీరు రాసిన విషయాలను ఇలా విత్‌డ్రా చేసుకుంటారని మాకు తెలియదన్నారు. మీ పుస్తకంలో మీరు తప్పులు, అబద్ధాలు రాసి ఉంటే.. అదే విషయం ప్రజలకు చెప్పండని సూచించారు.
ఇవి కూడా చదవండి : సోలార్ భూములకు చట్టబద్ధమైన రక్షణ ఇవ్వాలి.. CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు