- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీపై మంత్రి కీలక ఆదేశాలు
ఏపీ బ్యూరో, అమరావతి: అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సాధ్య సాధ్యానాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. అధికారులు బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేలా వారికి సమాచారం అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.