Chandrababu Case: తెలంగాణ స్పీకర్ పోచారంపై మంత్రి బొత్స మండిపాటు

by srinivas |   ( Updated:2023-09-23 10:22:58.0  )
Chandrababu Case: తెలంగాణ స్పీకర్ పోచారంపై మంత్రి బొత్స మండిపాటు
X

దిశ, వెబ్ వెస్క్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరును చాలా మంది నేతలు ఖండిస్తున్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు సరికాదని సూచించారు. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని విమర్శించారు. తెలంగాణలో ఇలాంటి తప్పులు చేస్తే వదిలివేయవచ్చా అని.. సీఎం కేసీఆర్‌ను అడగాలని బొత్స హితవు పలికారు.

Advertisement

Next Story