- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భీమిలి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత, విద్యాశాఖామంత్రి బొత్సా సత్యనారాయణ ఈ పర్యాయం విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్సా సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా అధిష్టానం ఎంపిక చేసింది. ఆమె ఇప్పటికే విశాఖ పార్లమెంటు పరిధిలో ప్రచారాన్నిప్రారంభించి సన్నిహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీచేస్తున్న సమయంలో భర్త బొత్స విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చీపురుపల్లి నుంచి తిరిగి పోటీ చేయించడం సమంజసం కాదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు తెలిసింది. భార్యతో పాటు భర్త కూడా విశాఖ పార్లమెంటు పరిధిలో పోటీ చేయడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది. ఈ కారణంగా విజయనగరం జిల్లాను ఆనుకొని వుండి, కాపు సామాజిక వర్గానికి బలమైన భీమునిపట్నంను ఎంపిక చేసినట్లు తెలిసింది. భీమిలి నియోజక వర్గ పరిధి విశాఖ నగరం వరకూ ఉంది. సిటీలో భాగమైన సాగర్ నగర్, మధురవాడ, సింహాచలం భీమిలిలో ఉన్నాయి. కొద్ది సంవత్సరాలుగా బొత్స కుటుంబం విశాఖలోనే నివాసం ఉంటుంది. ఈ పరిణామాల నేపధ్యంలో బొత్స సత్యానారాయణను భీమిలి నుంచి బరిలోకి దించితే లోక్ సభ అభ్యర్ధి విజయావకాశాలు మరింతగా మెరుగౌతామని అధిష్టానం అంచనాకు వచ్చింది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తరువాత ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలిసింది.
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు అవంతి
ప్రస్తుత భీమిలి శాసనసభ్యడు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ( అవంతి)ని ఆ పక్కనే ఉండే నెల్లిమర్లకు మార్చనున్నారని తెలిసింది. ప్రస్తుతం బొత్సా మేనల్లుడు బడ్డుకొండ అప్పల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విపరీతమైన సెటిల్మెంట్లు, పర్సంటేజీలు, బలవంతపు వసూళ్ల కారణంగా నియోజకవర్గంలో బాగా చెడ్డ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఆయన విజయం కష్ణమని నివేదికలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అవంతి శ్రీనివాస్‌ను అక్కడకు పంపించాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నియోజక వర్గంలో బొత్స పలుకుపడి ఉంటుందని, అవసరమైతే ఆయనతో ప్రచారం చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.