- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అదే: రాష్ట్ర మంత్రి అనిత
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, రాష్ట్ర మంత్రులుగా పవన్ కల్యాన్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ సహా 24 మంది ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు కేబినెట్‌లో అతిపిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత రికార్డులోకెక్కారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారని.. సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తా అని తెలిపారు. పోరాటాలు చేసి విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. అమరావతే రాజధానిగా ఇకపై పాలన సాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా అనిత గెలుపొందారు. అనిత తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామ ప్రసాద్ రెడ్డి (42)లు అతిపిన్న వయస్కులుగా ఉన్నారు.