- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనకాపల్లికి కొత్త ఇంచార్జి.. మంత్రి అమర్‌నాథ్ కంటతడి
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అమర్‌నాథ్ కంటతడి పెట్టారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రి పదవిని చేపట్టారు. అయితే అనకాపల్లికి మలసాల భరత్‌ను సీఎం జగన్ ఇంచార్జిగా నియమించారు. మంత్రి అమర్‌నాథ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన జాబితాలోనూ మంత్రి అమర్‌నాథ్ పేరు లేదు. అంతేకాదు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని వీడటంపై మంత్రి అమర్‌నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీకి దూరమై కార్యకర్తగా వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని మంత్ర అమర్‌నాథ్ స్పష్టం చేశారు. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ పలు నియోజకవర్గాలకు ఇంచార్జులను మార్చారు. కొంతమందికి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కొందరు పార్టీకే జై కొడుతుంటే మరికొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలా ఇంచార్జుల మార్పుతో వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.