Odisha: 58 మంది ఏపీ బాధితులను గుర్తించాం..ఒకరి మృతి: అమర్‌నాథ్

by srinivas |   ( Updated:2023-06-03 17:09:08.0  )
Odisha: 58 మంది ఏపీ బాధితులను గుర్తించాం..ఒకరి మృతి: అమర్‌నాథ్
X

దిశ, వెబ్ డెస్క్: సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి ప్రాణాలు కోల్పోయారని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులను బాలాసోర్‌లో ఆయన పరామర్శించారు. ఏపీకి చెందిన 58 మంది బాధితులను గుర్తించామని చెప్పారు. 30 మందికి సంబంధించిన ఫొటో గ్రాఫ్స్ లభించాయని తెలిపారు. బాధితులను ఇంకా గుర్తిస్తున్నామన్నారు. బాధితులను భువనేశ్వర్ అపోలోకు లేదా వైజాగ్ తరలిస్తామని చెప్పారు. బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed