- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP POLITICS:ఏపీలో కూటమిపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!
దిశ ప్రతినిధి,అనకాపల్లి: చిరకాల మిత్రుడు సీఎం రమేష్ గారిని అనకాపల్లిలో గెలిపించాలని సినీ నటుడు చిరంజీవి అభ్యర్ధించారు. తన ఆశీస్సులతో రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలని , వీరిద్దరూ తనకు కావాల్సిన మిత్రులని ఆయన అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులు ఆదివారం హైదరాబాద్ లో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు. తనకు కావాల్సిన ఇద్దరు రమేష్‌లు మన అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆనందం కల్గిస్తుందని సమర్ధవంతమైన నాయకులు పోటీ చేయడం శుభపరిణామమని, వారికి విజయం రావాలని పేర్కొన్నారు.
సీఎం రమేష్ పలుకుబడి గురించి తనకు బాగా తెలుసని కేంద్రాల్లో సీఎం రమేష్ కి ఉన్న పరిచయాలు, సత్సంబంధాలు మన అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కూటమి అభ్యర్థుల అందరికీ ప్రజలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిరంతరం అభివృద్ధి చేసే తపన ఉన్న సమర్ధవంతమైన నాయకులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారని చిరంజీవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అనేది తన పెద్ద కోరిక అని, అభివృద్ధి చేసే నాయకుల పక్షాన మాత్రమే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. అంటువంటి వారి గెలుపు కోసం అందరూ ముక్త కంఠం తో నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తప్పకుండా సీఎం రమేష్ గెలుస్తారని ప్రజలు గెలిపించుకుంటారన్న బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.