జగన్ డైలాగ్‌కు మెగా బ్రదర్ నాగాబాబు పవర్‌ఫుల్ కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2024-02-19 13:20:22.0  )
జగన్ డైలాగ్‌కు మెగా బ్రదర్ నాగాబాబు పవర్‌ఫుల్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిద్ధం సభలో జగన్ పార్టీ గుర్తులపై వేసిన డైలాగ్ కు జనసేన నేత, మెగా బ్రదర్ నాగాబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుంది. కానీ, 'ఫ్యాన్' రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలీ కూడ ఇవ్వదు.. అయిన సారూ మీరు పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు,పంచులు మీద పెట్టిన శ్రద్ధలో సగం 'ప్రజాపరిపాలన' మీద పెట్టుంటే బాగుండేది. I'm telling that. అంటూ.. సినిమా డైలాగ్ తో కౌంటర్ ఇచ్చారు. అంతేగాక, ఈ పోస్టుకు హలో ఏపీ బై బై వైసీపీ అనే హాష్ ట్యాగ్ ను జత చేశారు. కాగా నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఇంటి బయట ఉండాలి.. అలాగే తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అని అనే డైలాగ్ వాడటంతో.. దానికి టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ డైలాగులు కొడుతున్నారు.

Advertisement

Next Story