శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత..

by Vinod kumar |   ( Updated:2023-05-04 14:35:28.0  )
శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత..
X

దిశ, శ్రీశైలం: భారీ మద్యం పట్టబడిన ఘటన శ్రీశైలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం పాతాళగంగ సమీపంలో ఒక ఇంట్లో భారీ మద్యన్ని ఎస్సై లక్ష్మణరావు వారి సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతకాలంగా నాగన్న అనే వ్యక్తి మద్యం అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొద్దిరోజులుగా అతనిపై నిఘా వేసి ఉంచారు. దీంతో అతని ఇంట్లో రైడ్ చేయగా.. మొత్తం అతని ఇంట్లో 148 బాటిళ్లు దొరికాయని ఎస్సై తెలిపారు.

ఇందుల్లో సిల్వర్ 180 ఎం ఎల్ 66 బాటిల్లు, 8 పీ ఎం 175 ఎంఎల్ 12 బాటిళ్లు, మ్యాన్షన్ హౌస్ 180 ఎం ఎల్ 24 బాటిల్లు, దారు మైన్స్ 180 ఎం ఎల్ 20 బాటిల్స్ ఉన్నాయి. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కి తరలిస్తామన్నారు. శ్రీశైలంలో ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఎవరైనా మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు మనమంతా కృషి చేయాలని శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed