- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల భారీ ఆందోళన
దిశ, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) వద్ద కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది. అయినప్పటికీ ఈడీ ఆఫీసు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారులను బయటికి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద, ఈడీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు, సీఐఎస్ఎఫ్(CISF) బలగాలను మోహరించారు. కాంట్రాక్టు పీరియడ్ ఉన్నంత వరకైనా కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఇలా అర్థాంతరంగా తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని పలు యూనియన్లు సంస్థను కోరాయి.