‘మేమేం తప్పు చేశామో అర్థం కావట్లే’.. ఓటమిపై YCP మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Satheesh |
‘మేమేం తప్పు చేశామో అర్థం కావట్లే’.. ఓటమిపై YCP మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీ అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇంతకు వరకు ఏ పార్టీ ఓడని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన వైసీపీ.. ఏకంగా పోటీ చేసిన 164 సీట్లలో ఓటమి పాలై.. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి అధికారాన్ని పొగొట్టుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఓటమిపై రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో అసలు మేం ఏం తప్పు చేశామో అర్ధం కావడం లేదని, నిరంతరం ప్రజల కోసమే పని చేశామని తెలిపారు.

అయిన ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోవడం బాధగా ఉందన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసిన ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మేం చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి మరోసారి రాష్ట్రంలో వైసీపీనే గెలుస్తోందని, జగన్ రెండో సారి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, కానీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయామన్నారు. ఐదేళ్లలో మా వ్యక్తిగత పనులన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం పని చేసిన ఎన్నికల్లో ఓడిపోవడం బాధగా ఉందని అన్నారు. కాగా, గతంలో రాజమండ్రి ఎంపీగా పని చేసిన భరత్.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన భరత్.. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisement

Next Story