- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఇటీవల తిరుపతిలోని ‘మోహన్ బాబు యూనివర్సిటీ’లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. సరైన వ్యక్తిని గెలిపించండి. ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారికే మద్దతు ఇవ్వండి. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వాడు మనకేం న్యాయం చేస్తాడు. ఎవరైనా డబ్బులిస్తే థ్యాంక్స్ చెప్పండి. ఓటు మాత్రం సరైన వ్యక్తికే వేయండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఏపీలోని రూలింగ్ పార్టీని ఉద్దేశించే మనోజ్ చేశాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో మనోజ్‌పై వైసీపీ శ్రేణులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా.. ఆ వ్యాఖ్యలకు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ‘నాన్న పుట్టినరోజు వేడుకల్లో నా ప్రసంగంపై నెలకొన్న గందరగోళంపై స్పష్టత ఇవ్వాలనుకున్నా. ప్రతీది రాజకీయంగా చూడకుండా ఐక్యత, గౌరవంగా ముందుకు సాగాలనేది నా మాటల ఉద్దేశం. ఏదో ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. గొడవలు కూడా లేవు. నటుడిగా నన్ను, నా కుటుంబాన్ని ఆదిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అని మనోజ్ సోసల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.