దారుణం : ఆటోలో వెళ్తున్న వ్యక్తిని.. నడి రోడ్డుపైనే అలా చేసి..

by samatah |
దారుణం : ఆటోలో వెళ్తున్న వ్యక్తిని.. నడి రోడ్డుపైనే అలా చేసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం అనేది మరచి ఏకంగా నడిరోడ్డు మీద మనిషి ప్రాణాలు తీస్తున్నారు కొందరు. తాజాగా ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టింస్తోంది. జిల్లాలోని కంచర్లపాలెం వద్ద తెనాలి నంది వెలుగు రహదారిపై దారుణం జరిగింది. ఆటోలో వెళ్తున్న వ్యక్తిని అడ్డుకొని కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు తెనాలికి చెందిన రబ్బానీ సాహెబ్ (50) గా గుర్తించారు. అలాగు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed