Karthika Masam:ఎండ్రకాయ రూపంలో దర్శనమిస్తున్న మహాదేవుడు.. ఎక్కడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-11-10 10:54:48.0  )
Karthika Masam:ఎండ్రకాయ రూపంలో దర్శనమిస్తున్న మహాదేవుడు.. ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ నెల రెండవ తేదీ నుంచి కార్తీక మాసం(Karthika Masam) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికంగా దివ్యమైనది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేస్తారు. ఈ మాసంలో శివ కేశవులను భక్తులు పూజిస్తారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంతో శుభకరము అని భక్తులు నమ్ముతారు. ఇక ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాస శోభ సంతరించుకుంది.

ఆలయాల్లో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆలయం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చిట్వేల్ మండలంలోని గుండాల కోన ఒకటిగా చెప్పవచ్చు. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. అయితే ఇక్కడి విశిష్టత ఏంటంటే.. గుహలో ఎండ్రకాయ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గుండాల కోన వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి 9కి.మీ అడవి బాటలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed