AP Political News: నాకు అసలు ఆ ఆలోచనే లేదు.. మాగంటి సంచలన వ్యాఖ్యలు..

by Indraja |   ( Updated:2024-03-27 08:41:22.0  )
AP Political News: నాకు అసలు ఆ ఆలోచనే లేదు.. మాగంటి సంచలన వ్యాఖ్యలు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గత 24 గంటల నుంచి టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై మాగంటి బాబు స్పందించారు.

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు.

తాను వ్యక్తిగత పనులపై హైదరాబాద్ లో ఉండటం కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేనన్నారు. అలానే టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు 'లేదు' అని మాగంటి బాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story