- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీడితోటలో స్కెచ్: భర్తను ఒడిలో పడుకోబెట్టుకుని భార్య నాటకం..ప్రియుడితో కలిసి కిరాతకం
దిశ, డైనమిక్ బ్యూరో : పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. మంచి భర్త చక్కగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న భర్త భార్యను పనికి మానిపించేశాడు. దీంతో భర్త బతికి ఉండగా ప్రియుడిని కలవలేమని భావించింది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ప్రయత్నించింది. ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసు విచారణలో డామిట్ కథ అడ్డం తిరిగింది. అంతే భార్య, ఆమె ప్రియుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈనెల 20న జరిగిన ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.
ప్రియుడితో కలిసి స్కెచ్
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు, జానకి దంపతులు. జానకి తాపీపనికి వెళ్తుండేది. ఈ క్రమంలో పాత కృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రి చింతల రాముతో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని భర్త పసిగట్టాడు. తన భార్యను అదుపులో పెట్టుకునేందుకు పనికి మాన్పించేసి ఇంటికే పరిమితం చేశాడు. అయితే జానకి ప్రియుడి ఎడబాటును భరించలేకపోయింది. భర్త బతికి ఉండగా ప్రియుడిని కలవలేనేమోనని భావించింది. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో రోజూ ఎంజాయ్ చేయోచ్చని భావించింది. ఇందుకు ప్రియుడు రాముతో కలిసి స్కెచ్ వేసింది.
జీడితోటలో హత్య
అప్పల నాయుడు అడ్డు తొలగించుకోవాలని అటు భార్య జానకి ఇటు ఆమె ప్రియుడు రాము ప్లాన్ వేశారు. ప్రియుడి ప్లాన్ను జానకి అమలు చేయడం ప్రారంభించింది. భర్తపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోసింది. ఈ ప్రేమ వెనుక ప్రాణం తీసే కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ఆ అమాయకపు భర్త గమనించలేకపోయాడు. తన భార్య పూర్తిగా మారిపోయిందని నమ్మాడు. ఇదే అదనుగా భావించిన జానకి భర్తను మాయమాటలతో మభ్యపెట్టి ఈ నెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి తీసుకువెళ్లింది. ఇద్దరూ కలిసి దైవదర్శనం పూర్తి చేసుకుని తిరుగుపయనమయ్యారు. అయితే మార్గ మధ్యలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలని భర్తకు చెప్పింది. బలవంతంగా బైకు ఆపించింది. ప్లాన్ ప్రకారం రోడ్డుపక్కన జీడితోటలోకి అప్పలనాయుడిని తీసుకువెళ్లింది. అక్కడ కాసేపు కూర్చుందామని చెప్పి భర్తను ప్రేమలోకి దించింది. అప్పలనాయుడు తలను ఒడిలో పెట్టుకుంది. అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రియుడు రాము తన వెంట తెచ్చుకున్న సుత్తితో అప్పల నాయుడు తలపై బలంగా మోదాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ఇద్దరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి రాము ఉడాయించాడు. అప్పుడు జానకి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమకు యాక్సిడెంట్ అయ్యిందని....అప్పల నాయుడు చనిపోయాడని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం తరలించారు.
తీగలాగితే డొంక కదిలింది
అప్పలనాయుడు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. అయితే జానకి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. ఇంతలో అప్పలనాయుడు కుటుంబ సభ్యులు జానకిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమె వివాహేతర సంబంధాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో ప్రియుడితో కలిసి తన భర్తను తానే హత్య చేసినట్లు జానకి అంగీకరించింది. అంతేకాదు ప్రియుడు ఎక్కడ ఉన్నాడో కూడా అడ్రస్ మరీ చెప్పింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దారుణ ఘటనతో అప్పల నాయుడు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.