AP News : సజ్జల భార్గవ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

by M.Rajitha |
AP News : సజ్జల భార్గవ రెడ్డిపై లుకౌట్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్సీపీ(YSRCP) సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు లుకౌట్(Look Out) నోటీసులు జారీ చేశారు. ఏపీలో సజ్జల భార్గవ్ రెడ్డి(Sajjala BhargavReddy)పై ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. భార్గవ్ రెడ్డితోపాటు అర్జున్ రెడ్డిపై కూడ పలు కేసులు నమోదయ్యాయి. వీరు విదేశాలకు పారిపోతారనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నాడని వర్రా రవీందర్ రెడ్డి(Varra Ravinder Reddy) అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేసి విచారించగా.. వీరి ఇరువురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిపై కేసులు ఉండటంతో పోలీసులు తాజాగా ఈ నోటీసులు జారీ చేశారు.

Advertisement

Next Story