Nara Lokesh's Yuvagalam Padayatra.. పలువురిపై హత్యాయత్నం కేసు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 11:15:15.0  )
Nara Lokeshs Yuvagalam Padayatra.. పలువురిపై హత్యాయత్నం కేసు
X

దిశ, అమరావతి: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తలపెట్టిన యువగళంలో పోలీసులు పలువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. బంగారుపాళ్యం ఘటనలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేష్ సహా సీనియర్ నేతలపై 353, 290, 188, 341, ఐపీసీ సెక్షన్ల కింద లోకేష్‌తో పాటు కీలక నేతలపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు జయప్రకాష్, జగదీష్, కోదండ యాదవ్ సహా మరికొందరు నేతలపై 307,332 143 ,341 ,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లోకేష్‌తో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తదితర నేతలపై కేసు ఫైల్ అయింది.

పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా పోలీసులు పేర్కొన్నారు. నిన్న బంగారుపాళ్యంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బహిరంగ సభ జరగకుండా వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. దీంతో లోకేష్ పక్కనే ఉన్న డాబా ఎక్కి ప్రజలతో మాట్లాడారు. పోలీసుల తీరును తప్పుపడుతూ వారితో తెలుగుదేశం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు యువగళం వాహనాల్ని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. కార్యకర్తలపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

READ MORE

Bhuma Vs Silpa : రగులుతున్న నంద్యాల.. భూమా వర్సెస్ శిల్పా!

జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed