- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే లోకేశ్ టూర్ : మంత్రి జోగి రమేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంలోని పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన అంటూ రాష్ట్ర మంత్రి జోగి రమేశ్ అన్నారు.లేకపోతే ఢిల్లీలో లోకేశ్‌కు ఏం పని అని నిలదీశారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్‌ను తీసుకుని వచ్చారు వాదించుకోండి ఢిల్లీలో లోకేశ్‌కు ఏంటి పని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందిగామ కోర్టుకు హాజరైన మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాక్యలు చేశారు. టీడీపీ, జనసేన వాళ్ళ బంధం ఫెవికాల్ బంధం అని అన్నారు. రెండు పార్టీలు ఎప్పుడూ అతుక్కునే ఉంటాయన్నారు. జనసేన-టీడీపీ 2014 నుంచే కలిసి ఉన్నాయని...విడిగా వస్తారని వైసీపీ ఎప్పుడూ భావించలేదు అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనను చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని హెచ్చరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా మార్చాడు అని ధ్వజమెత్తారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి హవాలా రూపంలో వేలకోట్ల రూపాయలు దొడ్డిదారిన తరలిస్తాడని చంద్రబాబు గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును మేధావి అన్నవారే నేడు తగిన శాస్తి జరిగింది అని అంటున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ నాలుగేళ్ల పరిపాలనలో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని.. చంద్రబాబు వల్ల ఏం లబ్ధి జరిగిందో చెప్పాలి అని మంత్రి జోగి రమేశ్ నిలదీశారు.