- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Bhuvaneshwari : తల్లితో కలిసి ఢిల్లీకి లోకేశ్ : ఏపీలో పరిస్థితులపై హస్తినలో గళం
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. బాబుతోనే నేను నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరును ఢిల్లీ వేదికగా చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తల్లితో కలిసి హస్తినకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులు, స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తదితర అంశాలను జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాకు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. అదే తరుణంలో కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నాయకులను కూడా లోకేశ్ అండ్ టీం కలవనున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయస్థాయిలో వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అనే విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని.. ఏపీలో ఉన్న పరిస్థితులను వివరించాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో సైతం స్పందన వచ్చింది. అంతేకాదు జాతీయ నాయకులు మద్దతు సైతం ఒక్కొక్కరిగా పెరుగుతుంది. చంద్రబాబును రాజకీయకక్షతోనే అరెస్ట్ చేశారని జాతీయ స్థాయిలోని నేతలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తదనంతరం జరిగిన పరిణామాలపై మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని..వాటన్నింటినీ మీడియాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీ కార్యాలయాలపైనా, నేతలపైనా జరిగిన దాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం... అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు వంటి అంశాలను జాతీయస్థాయిలో లోకేశ్ వివరించనున్నట్లు తెలుస్తోంది. అంగళ్లులో చంద్రబాబుపై దాడి చేసి తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని నారా లోకేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యవస్థల నిర్వీర్యంపై వివరించే ఛాన్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. అలాగే టీడీపీ నేతల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అలాగే మార్గదర్శి వంటి సంస్థలపై ఊపిరి సలపకుండా జరుపుతున్న దాడులు.. అమరరాజా వంటి సంస్థలపై దాడులు, కియా సంస్థల దగ్గర వైసీపీ నేతల అరాచకాలను నారా లోకేశ్ జాతీయస్థాయి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిందని అందుకు గల కారణాలను వివరించనున్నారు. 73 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేకుండా... గవర్నర్ అనుమతి లేకుండా.. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
హస్తిన టూర్‌పై భిన్నాభిప్రాయాలు
నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనపై పార్టీలోని కొందరు పెద్దలు భిన్నాభిప్రాయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒకవైపు కేంద్రం పెద్దలకు తెలిసే చంద్రబాబు అరెస్ట్ జరిగిందనే వాదనలు వినిపించారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీకి వెళ్లడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏపీలో సానుభూతిని పెంచుకునే ప్రయత్నం చేయడంతోపాటు.... జనసేనతో కలిసి ఉమ్మడి కార్యచరణపై ఫోకస్ పెడితే సత్ఫలితాలు వస్తాయని సూచించినట్లు తెలిసింది. మరికొందరైతే వినాయకచవితి అనంతరం ఢిల్లీ వెళ్తే బెటర్ అనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నారా లోకేశ్ ఈ అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఢిల్లీ టూర్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
More News : నారా ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్‌కి కటీఫ్..! అసలు రీజన్స్ ఇవే