- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రాలయంలోకి లోకేశ్ పాదయాత్ర
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ముగిసింది. 80వ రోజు అయిన మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మంగళవారం ఉదయం ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమయింది. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్‌కు మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రాలయంలోకి ప్రవేశించిన అనంతరం నారా లోకేశ్ గవిగట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. అనంతరం బాపుల దొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పేకలబెట్టి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమయ్్యారు. కోసిగిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో భోజన విరామం తీసుకున్నారు. రాత్రికి కోసిగి శివారు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.