- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:సామాన్యులకు అండగా “ప్రజాదర్బార్”..ప్రతి ఒక్కరి కష్టాన్ని వింటూ లోకేష్ భరోసా
దిశ,అమరావతి:సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలు, వారి సమస్యల పరిష్కారం కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఉండవల్లి నివాసంలో 16వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. యువనేతకు నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి ఆయా సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. యువనేత భరోసాతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ రేషన్ మాఫియా పై చర్యలు తీసుకోవాలి..
పక్షవాతంతో బాధపడుతున్న తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన సిహెచ్.శంకర్రావు నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన బి.పుట్లమ్మ కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చినకాకానికి చెందిన గౌసియా బేగం విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని మంగళగిరికి చెందిన ఉద్యోగులు కోరారు. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల విక్రయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి, కురగల్లుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు విజ్ఞప్తి చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పి.నాగ సురేష్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీలకు సరఫరా చేసిన గుడ్లకు గత ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని పంపిణీదారులు కోరారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్, ఆరోగ్యశ్రీ సదుపాయాలు కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి(డీఆర్ డీయే), సెర్ప్ సంస్థల్లో పనిచేస్తున్న మండల వ్యవసాయ నిపుణులు కొనసాగించాలని సిబ్బంది కోరారు. విద్యారంగం బలోపేతం కోసం ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు సంపత్ నగర్ లో తన వంద గజాల స్థలాన్ని కబ్జా చేశారని, తగిన న్యాయం చేయాలని కాట శ్రీనివాసరావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి వికలాంగ ధృవపత్రం మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ జక్కంపూడి కాలనీకి చెందిన కే.సన్యాసి విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ తో మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని ఏలూరు జిల్లా చిత్తపూరుకు చెందిన మామిళ్లపల్లి పరమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి నారా లోకేష్... సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంపై యర్రబాలెంకు చెందిన మహిళా రైతులు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి అభినందలు తెలిపారు.