World Malaria Day: దోమలను నిర్మూలిద్దాం.. మలేరియా వ్యాధిని కట్టడి చేద్దాం

by Indraja |   ( Updated:2024-04-25 12:33:31.0  )
World Malaria Day: దోమలను నిర్మూలిద్దాం.. మలేరియా వ్యాధిని కట్టడి చేద్దాం
X

దిశ, దొరవారి సత్రం: దోమలు పుట్టకుండా.. కుట్టకుండా నిర్మూలిద్దాం.. మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు వి చైతన్య, ఎం చంద్రకళ వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టారు.

దోమ తెరలు వాడండి - దోమలను నివారించండి, వేపాకు పొగ - దోమలకు సెగ, నిల్వ ఉన్న నీళ్లు, దోమల ఉత్పత్తికి పుట్టినిల్లు, ఫ్రైడే ఫ్రైడే పాటించండి - దోమలను నివారించండి అంటూ పలు నినాదాలు చేస్తూ దొరవారి సత్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మలేరియా జ్వరాలను కట్టడి చేయాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు.

మన దేశాన్ని కూడా దోమల రహిత దేశంగా ప్రకటించుకోవాలంటే అందరం సమిష్టి కృషితో పనిచేస్తూ పారిశుద్ధ్యన్ని చక్కబెట్టి, దోమల ఉత్పత్తికి ఆవాసాలైన నీటి నిల్వలు లేకుండా చేయాలని వైద్యాధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ సంపూర్ణమ్మ, పీహెచ్ఎన్ పద్మావతి, హెల్త్ విజిటర్ మైధిలి, ఆప్తమాలజిస్ట్ లలిత్ కుమార్, ఎల్‌టి మురళి, ఏఎన్ఎం శ్రావణి, అమరావతి, మల్లీశ్వరి, వజ్రమ్మ, రుక్మిణి, సౌజన్య, వెంకమ్మ,హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, విజయ్ కుమార్, వెంకటయ్య ఎంఎల్‌హెచ్‌పి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More..

AP Politics: మే 1 న ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వండి..

Advertisement

Next Story

Most Viewed