- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lakshmi Parvathi: మరోసారి మాట్లాడితే ఊరుకోను.. రజినీకాంత్‌కు వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు గురించి మాట్లాడే అర్హత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. చంద్రబాబుతో కలిసి రజినీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు గురించి రజినీకాంత్ తెలుసుకోవాలని సూచించారు. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్ మాటలకు అలాంటి స్పందనే ఉందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిని చేసిన సమయంలో చంద్రబాబుకు రజినీకాంత్ అండగా నిలిచారని చెప్పుకొచ్చారు.
అనంతరం ఎన్టీఆర్‌ని కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఈ ఎపిసోడ్లో రజినీకాంత్‌పై చాలా విమర్శలు వచ్చాయని... తమిళ మీడియా సైతం తీవ్రంగా తప్పుబట్టిందన్నారు. శత జయంతి వేడుకలకు రజినీకాంత్ హాజరుకావడం వెనుక చంద్రబాబు పొలిటికల్ ప్లాన్ ఉందన్నారు. రజినీకాంత్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. సర్వేలన్నీ జగన్‌కు అనుకూలంగా ఉండడంతో, చంద్రబాబు సినిమా వాళ్లతో నాటకాలు ఆడిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు.