నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం

by srinivas |   ( Updated:2024-12-05 10:52:46.0  )
నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీహరికోట(Sriharkota) నుంచి పీఎస్ఎల్వీ-సీ59(PSLV C-59) రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. నిప్పులు కక్కుతూ కక్ష్యలను దాటుకుంటూ రాకెట్ దూసుకుపోతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency)కి చెందిన ప్రోబా3 ఉపగ్రహాన్ని(Proba3 satellite) ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్తోంది. సూర్యుడి ఉపరితలంపై ప్రోబా-3 అధ్యయనం చేయనుంది. ఈ ప్రయోగాన్ని సరిగ్గా ఈ సాయంత్రం 4.12 గంటలకు ఇస్రో(Isro) ప్రయోగించింది. ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపారు. ఈ రాకెట్‌ను సుమారు 550 కేజీల బరువుతో ఇన్ ఆర్బిట్ డెమానిస్ట్రేషన్ లక్ష్యంగా ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ఇస్రో అధికారులు సంయుక్తంగా ప్రయోగించారు.

Advertisement

Next Story

Most Viewed