గ్యాస్ పైప్‌లైన్ పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

by S Gopi |
గ్యాస్ పైప్‌లైన్ పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడ వద్ద గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలింది. ఈ ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇంటింటికి గ్యాస్‌ను అందించేందుకు అదానీ కంపెనీకి చెందిన ఏజీ అండ్‌ పీ అనే కంపెనీ పైప్‌ లైన్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ట్రయల్‌ పద్ధతిలో గాలిని పైపుల్లో నింపుతుండగా ఒక్కసారిగా ప్రెజర్ పెరిగి పైపులు పగిలిపోయాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. దీంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పైపులను పరిశీలించారు. పైపులను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా గాలిని నింపుతుండగా పైపులు పగిలినట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story