అరకు రోడ్డులో జారిపడ్డ కొండచరియలు

by karthikeya |   ( Updated:2024-09-08 12:53:21.0  )
అరకు రోడ్డులో జారిపడ్డ కొండచరియలు
X

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం స్థంభించింది. తాజాగా విశాఖపట్టణంలోని అరకు రోడ్డులో ఉన్నట్లుండి కొండ చరియలు జారిపడ్డాయి.దీంతో ఘాట్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలియగానే అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని కొండ రాళ్లను తొలగించే పనిలో నిమఘ్నమయ్యారు. అలాగే ట్రాఫిక్ క్లియర్ చేయడంపై కూడా దృష్టి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే నాలుగు రోజులుగా భారీ వర్షం పడుతుండడంతో అరకు ఘాట్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కొండలపై నుంచి ఎక్కడబడితే అక్కడ మట్టి పెళ్లలు, కొండచరియలు విరిగి రహదారిపై పడటంతో వాహనదారులు ఘాట్ రోడ్డుపై ప్రయాణించాలంటే భయపడిపోతున్న పరిస్థితి. ఇక తాజాగా భారీగా కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Read More..

Visakha: ప్రమాదకరంగా కొండవాలు ప్రాంతం.. కూలిపోయే స్థితిలో భవనాలు..!

Advertisement

Next Story

Most Viewed