Kurnool: ఆళ్లగడ్డలో వైసీపీకి భారీ షాక్.. జనసేనలో చేరిన కీలక నేతలు

by srinivas |   ( Updated:2023-11-06 13:42:12.0  )
Kurnool: ఆళ్లగడ్డలో వైసీపీకి భారీ షాక్.. జనసేనలో చేరిన కీలక నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గం వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో రాంపుల్లారెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డిని జనసేనలోకి పవన్ కల్యాణ్ సాధరంగా ఆహ్వానించారు.


ఇక రాంపుల్లారెడ్డితో పాటు తన అనుచరులు రామచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రసాదరెడ్డి సైతం జనసేనలో చేరారు. అనంతరం ఆళ్లగడ్డలో జనసేన పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు వివరించారు. సైద్ధాంతిక బలంతో పవన్ కల్యాణ్ చేస్తున్ పోరాటాలు తమను ఆకర్షించాయని ఇరిగెల రాంపుల్లారెడ్డి పేర్కొన్నారు.

అంతకుముందు ప్రముఖ సినీనటుడు సాగర్ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన సాగర్‌కి జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ... జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతోంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో తాము ముందుకు వెళ్తామని సినీనటుడు సాగర్ వెల్లడించారు.




జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ క ళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణకు చెందిన పలు వర్గాలు పార్టీలో చేరాయి. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ కార్యాలయంలో సినీనటుడు సాగర్‌తోపాటు మరికొందరు చేరారు. హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లక్కినేని సురేందర్ రావు, అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా అంతా కలిసి పనిచేయాలని పవన్ కల్యాణ్ నాయకులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed