Srisailam: ఆలయానికి భారీగా భక్తులు.. 5 కిలో మీటర్ల మేర వాహనాలు

by srinivas |   ( Updated:2023-08-13 14:47:52.0  )
Srisailam: ఆలయానికి భారీగా భక్తులు.. 5 కిలో మీటర్ల మేర వాహనాలు
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం నుంచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. ముఖద్వారం నుంచి శ్రీశైలం టోల్ గెట్ వరకు భారీగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వరుససెలువులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో వాహానాల్లో వచ్చిన భక్తులు సంఖ్య కూడా భారీగా పెరిగాయి. ఆలయం ముఖద్వారం, హటకేశ్వరం, గణపతి ఆలయం వద్ద రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేసి సాక్షిగణపతిస్వామి దర్శనానికి వెళ్ళారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలుస్తోంది. సుమారు గంటపాటు సాక్షిగణపతి ఆలయం సమీపంలో రోడ్లపై వాహనాలు ఆగడంతో ట్రాఫిక్‌లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ అయింది

Advertisement

Next Story