- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nandyala: విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల విజయ డెయిరీ( Nandyala Vijaya Dairy) వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. డెయిరీ చైర్మన్ జగన్(Jagan) అధ్యక్షతన బోర్డు సమావేశం(Board Meeting) జరుగుతోంది. ఈ నేపథ్యలో తమకు చెందిన డైరెక్టర్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ(Mla Bhuma Akhila Priya) అక్కడకు వెళ్లారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూమా అఖిల ప్రియతో చర్చిస్తున్నారు.
కాగా భూమా అఖిల ప్రియ, విజయ డెయిరీ చైర్మన్ జగన్‌కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా అఖిల ప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డిని పదవి నుంచి తొలగించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా విధుల నుంచి తొలగించారు. దీంతో అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో డెయిరీకి సంబంధించిన ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకునే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ జరిగింది. అయితే నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా కూడా భూమా అఖిల ప్రియ తన అనుచరులతో కలిసి విజయ డెయిరీ వద్దకు వెళ్లారు. తమ వాళ్లను నామినేషన్లు వేయడనీయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేశారు. మరో గడవును ప్రకటించలేదు. తాజాగా బోర్డు మీటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.