Allagadda: మానవత్వం చాటుకున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

by srinivas |
Allagadda: మానవత్వం చాటుకున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
X

దిశ, ఆళ్ళగడ్డ: టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. గాయపడిన వృద్ధురాలని ఆయన కారులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట సమీపంలో వృద్ధురాలని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయారు. అటుగా ప్రయాణిస్తున్న జగత్ విఖ్యాత్ రెడ్డి వృద్ధురాలని గమనించారు. గాయపడిన ఆమెను చూసి చలించిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం వృద్ధురాలి చికిత్సపై తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆరా తీశారు.

Next Story