Sriramanavami: ఇరువర్గాల ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు

by srinivas |   ( Updated:2023-03-30 09:52:13.0  )
Sriramanavami: ఇరువర్గాల ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్‌ మండలం మల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరాముడి ఆలయం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోసారి గొడవ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story