- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nandyala: టీడీపీలో వర్గ విభేదాలు.. బ్రహ్మానందరెడ్డి వర్సెస్ ఫారూఖ్
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నంద్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ఎన్ఎండీ ఫారూఖ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నియమించారు. అంతకుముందు భూమా బ్రాహ్మానందరెడ్డి నంద్యాల ఇంచార్జిగా ఉన్నారు. నియోజకవర్గ ఇంచార్జిని మార్చడంతో టీడీపీ కార్యక్రమాలకు భూమా బ్రహ్మానందరెడ్డి హాజరుకావడం లేదు. తాజాగా నంద్యాలలో నియోజకవర్గ విస్తృతస్థాయి భేటీ జరిగింది. ఈ భేటీకి కూడా బ్రహ్మానందరెడ్డి హాజరుకాలేదు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు భూమా బ్రహ్మానందారెడ్డిపై ఫారుఖ్ కుమారుడు ఫిరోజ్ ఫైర్ అయ్యారు. ఎన్ఎండీ ఫారూఖ్‌కు టికెట్ ఇస్తే ఎందుకంత కోపం వస్తుందని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున ఫారుఖ్ పోటీ చేస్తారని చెప్పారు. ఎవరు అడ్డుపడినా నంద్యాలలో గెలిచేది టీడీపీనేనని ఫిరోజ్ వ్యాఖ్యానించారు.