- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srisailam : వరుస సెలవులతో శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు..
దిశ ప్రతినిధి, శ్రీశైలం : నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అటు వరుస సెలవులు, ఇటు సోమవారం కావడంతో భక్తులు భారీగా క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థమై క్యూలైన్లలో, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.
కాగా స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టనుంది. మరోపక్క భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని స్వామివారిని దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.