శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి.. దిగువకు నీరు విడుదల

by srinivas |
శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి.. దిగువకు నీరు విడుదల
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొత్తం ఒక లక్షా 11 వేల 932 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ఎగువ పరీవాహక ప్రాంతాలు జూరాల నుంచి లక్షా 18 వేల 464 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 72 వేల114 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ ఫ్లోగా 1 లక్ష 90 వేల 828 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1 లక్ష 79 వేల 971 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed