- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీమ కోసం వారం రోజులుగా సంతకాల సేకరణ
దిశ, కర్నూలు ప్రతినిధి: ఢిల్లీలో సీమ గళం విన్పించేందుకు సంతకాల సేకరణ చేపట్టినట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు ఎంవీ.రమణారెడ్డి అన్నారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల రూరల్ మండలంలోని పోలూరు, మునగాల, రాయమాలుపురం గ్రామాల్లో ఆదివారం సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం, సిద్దేశ్వరం-సోమశిల వద్ద తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని కోరుతూ బైరెడ్డి నాయకత్వంలో ఉద్యమం సాగుతోందన్నారు. అందులో భాగంగానే వారం పాటుగా సంతకాల సేకరణ చేపట్టినట్లు చెప్పారు. అందువల్ల సీమ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మునగాల మాజీ సర్పంచ్ తూము విశ్వనాధ్ రెడ్డితోపాటు, బీజేపీ నియోజకవర్గ నాయకులు తూము శివారెడ్డి, పోలూరు నాయకులు జమాల్, నాగయ్య, పుల్లయ్య,
నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాయమాలుపురం గ్రామ నాయకులు దేవసహాయం, శ్రీనివాసులు, వెంకటయ్య, రమేష్, సాగర్ తదితరులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు.