- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆగని వలసల పర్వం.. ఖాళీగా దర్శనమిస్తున్న గ్రామాలు
ఉపాధి పనుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, కూలీలు వలసబాట పడుతున్నారు. చాలా గ్రామాలు బోసిపోయినట్లు కన్పిస్తున్నాయి. మూడు నెలల పాటు అంటే ఏప్రిల్ వరకు పనులు చేసుకుని మేలో తిరిగి స్వగ్రామాలకు వస్తారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300లకు పైగా విద్యార్థులు బడి మానేసి తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లారు.
దిశ, కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 8 లక్షల జాబ్ కార్డులున్నాయి. అందులో 18 లక్షల మందికి పైగా ఉపాధి కూలీలున్నారు. వీరంతా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం పాలకుల పుణ్యమా అని ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదు. కరువు మండలాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో పనులు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రతి ఏడాది వలసల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి జిల్లాలో లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. అందులో నంద్యాలకు లక్ష, కర్నూలు జిల్లాకు లక్ష మందికి చొప్పున ఉపాధి కల్పించాల్సి ఉంది. అయితే పనులు ప్రారంభించి రెండు నెలలు అవుతున్నా నేటికీ 43 వేలు మించి కూలీలకు పనులు కల్పించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది కూలీలు కుటుంబాలతో సహా పక్క జిల్లాలైన గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లోని దోర్నాల, చిన్న గుమ్మడిపాడు, కుంట, మార్కాపురం, చిన్న గుడిపాడు, గోతంపల్లె, పెద్ద గుడిపాడు, రేమిడిచర్ల, రేగుమాన్ పల్లె వంటి ప్రాంతాలకు మిరపకాయలు తెంచేందుకు వెళ్లారు.
పనులు చూపని అధికారులు
వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వివిధ కారణాలు చూపి కూలీలకు పనులు కల్పించడంలేదు. ప్రభుత్వం ఒకవైపు పెట్టబడులను ఆకర్శిస్తున్నామంటూ
గొప్పలు చెప్పకోవడం తప్ప క్షేత్రస్థాయిలో వలసల నివారణ, ఉపాధి అవకాశాలు కల్పించకడం లేదు.
కొందరికే పనులు
ఉపాధి పనుల ప్రారంభ సమయంలో ఒకే ఇంటికి చెందిన ఐదుగురు, ఆరుగురు మందికి కలిసి ఒకే జాబ్ కార్డు ఉంది. నిబంధనల ప్రకారం జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ వంద రోజుల పని దినాలు కల్పించాల్సి ఉంది. జాబ్ కార్డులో ఐదుగురుంటే ఒక్కొక్కరికి కేవలం 20 రోజుల పని దినాలు మాత్రమే వస్తున్నాయి. కుటుంబాలు వేరైనా నేటికీ జాబ్ కార్డులు వేరు చేసి ఇవ్వకుండా అధికారులు వివిధ సాకులు చెప్పి తప్పించుకుంటున్నా
రనే ఆరోపణలు ఉన్నాయి.
అలవెన్సులు కట్
వేసవి ప్రారంభంలో కూలీలకు కల్పించే ఉపాధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అలవెన్సులు కల్పించేది. ఎండల తీవ్రత కారణంగా ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో 30 శాతం, జూన్ లో 20 శాతం అలవెన్సలు కల్పించేది. రోజుకు రూ.257ల చొప్పున ప్రభుత్వం కూలి ఇస్తుంది. అందులో 20 నుంచి 30 శాతం పోనూ రోజుకు రూ.180 పని మాత్రమే గిట్టుతుంది. ప్రధాని మోడీ ఈ అలవెన్సులు కట్ చేయడంతో
కూలీలకు పనిభారం అధికమైంది.
వలసలు నివారించాలి
జిల్లాలో ఏడాదికేడాది వలసలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. యంత్రాల రాక కారణంగా కూలీలకు పనుల్లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన నిధులను దారి మళ్లించినట్లు తెలుస్తుంది. ప్రతి కూలీకి 200 రోజుల పని దినాలు కల్పించి రూ.600 వేతతం ఇవ్వాలి.
- నాగేశ్వర రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, నంద్యాల
పనులు కల్పించేందుకు కృషి
జిల్లాలో ప్రతి ఒక్కరికీ పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వలసలు వెళ్లిన వారికి సమాచారం చేరవేశాం. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించాం. కూలీల సంఖ్యను పెంచేందుకు మరింత కసరత్తు చేస్తున్నాం. చాలా మందికి ఒకే జాబ్ కార్డు ఉండడం వల్ల పని దినాలు తక్కువగా వస్తున్నాయి. వారందరిని దృష్టిలో ఉంచుకుని ఆధార్, రేషన్ కార్డులు ప్రత్యేకంగా ఉంటే వారికి కొత్త జాబ్ కార్డులిచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం.
- అమర్ నాథ్ రెడ్డి, డ్వామా పీడీ, కర్నూలు జిల్లా