- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నడ భక్తులతో నిండిన మహానంది క్షేత్రం..!
దిశ, కర్నూలు ప్రతినిధి: మహానంది క్షేత్రం మంగళవారం రాత్రి నుంచి కన్నడ భక్తులతో నిండిపోయింది. బుధవారం మధ్యాహ్నం వరకు కన్నడ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే వాహనాలు నిలిపే స్థలంలో త్రాగు నీరు.. అలాగే ఆలయానికి వచ్చే దారి మధ్యలో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ తదితర సౌకర్యాలు కల్పించారు. క్షేత్రం ప్రవేశద్వారం నుంచి ఎండ వేడిమి నుండి భక్తులకు రక్షణ కల్పించడానికి టెంట్లు, పెండల్స్ ఏర్పాటు చేశారు.
మంగళవారం రాత్రి 50 రూపాయల టికెట్ విక్రయించిన ఉచిత దర్శన సౌకర్యం కల్పించడంతోపాటు బుధవారం ఉదయం 6:30 నుంచి10 గంటల వరకు ఉచిత దర్శన ఏర్పాట్లు ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రం నుంచి రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న మహిళలు, వృద్దులు, వికలాంగులకు ప్రత్యేకంగా వెళ్లేందుకు అనుమతించారు. కన్నడ భక్తులకు క్షేత్రంలో ప్రవేశించిన సందర్భంలో ఉచితంగా బిస్కెట్లను కూడా పంపిణీ చేసి, ఉచిత దర్శనం అనుమతించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేచి ఉండకుండా త్వరగా దర్శనం చేసుకుని తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో ఉన్న అన్ని ద్వారాలను తెరచి ఉంచి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించారు.