- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: మెడికల్ కాలేజీలో అనాటమీ పేపర్ లీక్!
దిశ, కర్నూలు అర్బన్: ఎంబీబీఎస్ అనాటమీ టు-2 ప్రశ్నా పత్రాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తూ కర్నూలు మెడికల్ కళాశాలకు చెందిన ఇన్విజిలేటర్ చక్రపాణి పట్టుబడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కళాశాల అధికారులు చక్రపాణిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం అనాటమీ పేపర్-2 పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా ఉన్న డాక్టర్ చక్రపాణి తన ఫోన్‌లో ఫొటో తీశారు.
ఈ విషయాన్ని గుర్తించిన చీఫ్ అబ్జర్వర్ డాక్టర్ శ్రీనివాస్ ఇన్విజిలేటర్‌ను నిలదీశారు. సెల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు. అయితే చక్రపాణి నుంచి సమాధానం లేక తప్పించుకొనేందుకు ప్రయత్నించారు. అనంతరం ఫోన్ తీసుకొని చూడగా..అనాటమీ పేపర్-2, అనాటమీ పేపర్-1 క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో కళాశాలలో తాజాగా విచారణ నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే కళాశాలలోకి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు.