Karnataka Results: కర్నూలు రైతుల సంబరాలు

by srinivas |   ( Updated:2023-05-13 14:09:49.0  )
Karnataka Results: కర్నూలు రైతుల సంబరాలు
X

దిశ, కోడుమూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో కర్నూలు జిల్లా కోడుమూరులో రైతులు బాణాసంచాకాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు. తెనేశ్వర్ రెడ్డి, కౌలుట్ల, తిమ్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ప్యాలకుర్తి సలీమ్, గోరంట్ల సద్దుల శ్రీను, టైలర్ భీముడు, వెంకటగిరి అయ్యన్న, మిన్నెల్లా, కురువ వెంకటేశ్వర్లు తదితర రైతులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి:

Karnataka Election Results: కర్ణాటక కోసం పార్థించాం... బీజేపీని ఓడించాం: కేఏపాల్

Advertisement

Next Story